అల్లూరి సీతారామరాజు ఆదర్శంగా…

అల్లూరి సీతారామరాజు ఆదర్శంగా…

క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో..
వేసవిలో ప్రతిరోజూ మజ్జిగ పంపిణీ..
లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే బొండా ఉమా.

పాయకాపురం, ఆంధ్రప్రభ : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకొని,క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో వేసవిలో ప్రతిరోజూ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని సంఘం నేతలు తలపెట్టిన నేపధ్యంలో, ఈ బృహత్తర కార్యక్రమాన్నివిజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. బుడమేరు వంతెన అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద మొదటి రోజు ధాత గొట్టుముక్కల వెంకటేశ్వరరాజు (వెంకీ) సమక్షంలో ఎమ్మెల్యే బొండా ఉమా పాదాచారులకు మజ్జిగ పంపిణీ చేశారు.

కార్యక్రమంలో ముందుగా అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం తరఫున ప్రధాన ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రయాణికులు, కార్మికులు, ఆటో డ్రైవర్లు, రోడ్డుపై పనిచేసే మహిళలకు మజ్జిగ, చల్లని తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ఎండ తీవ్రత మధ్య ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఈ సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని బొండా ఉమా అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, క్షత్రియ సేవా సంఘం అధ్యక్షుడు పెనుమత్స అప్పలరాజు, వలివర్తి దుర్గాప్రసాద్, విజయరామరాజు, వలివర్తి రామరాజు, యువజన సంఘం అధ్యక్షులు కాకర్లపూడి బ్రహ్మరాజు, టీడీపీ నాయకులు ఆకుల సూర్యప్రకాష్, బుదాల సురేష్, లక్కీశెట్టి సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply