రెండు చుక్కలు జీవిత కాలం రక్షణ ఇస్తాయి
రెండు చుక్కలు జీవిత కాలం రక్షణ ఇస్తాయి
మహబూబ్ నగర్ రూరల్, ఆంధ్రప్రభ : రామచంద్రపురం గ్రామంలో సర్పంచ్ వై నర్సిములు (బాబురావు) చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రెండు చుక్కలు అత్యంత ప్రభావితం.. రక్షణ కల్పిస్తాయని, ఐదు సంవత్సరాలలోపు పిల్లలు అందరూ రెండు చుక్కల పల్స్ పోలియో వేసుకోవాలని అన్నారు.
పక్షవాతం వంటి భయంకరమైన వ్యాధి నుంచి మీ చిన్నారులను కాపాడుతుందని చెప్పారు. ఈ పోలియో చుక్కలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అంగన్వాడీ కేంద్రాలలో ఈనెల 30 వరకు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మిథున్ సాయి, అంగన్వాడి కార్యకర్తలు శోభ రాణి, పద్మ, మరియు ఆశా కార్యకర్తలు జయమ్మ, శ్వేత, ఇందిర పాల్గొన్నారు.
