సిరిపురంలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం

లింగాలఘనపూర్, ఆంధ్రప్రభ: లింగాలఘనపూర్ మండలంలోని సిరిపురం గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ చిటకోరు సంపత్ ప్రారంభించారు. పోలియో కేంద్రంలో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బస్వగాని లలిత, వార్డు సభ్యుడు బస్వగాని విట్టల్, ఏఎన్‌ఎం అనిత, ఆశా వర్కర్ సందేనా రామ, అంగన్‌వాడీ టీచర్ మల్లీశ్వరి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.