ఆలేరులో ముమ్మరంగా పల్స్ పోలియో
ఆలేరులో ముమ్మరంగా పల్స్ పోలియో
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో, మండలంలోని వివిధ గ్రామాలలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం ముమ్మరంగా ప్రారంభమైంది. గుండ్లగూడెంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని సర్పంచ్ ఏసిరెడ్డి, మంజుల మహేందర్ రెడ్డి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో పిల్లలకు తల్లిదండ్రులు పల్స్ పోలియో చుక్కలను వేయించారు. పలు పల్స్ పోలియో కేంద్రాలను శారాజీపేట మండల వైద్యాధికారిణి హైమావతి సందర్శించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు.
