రెండు చుక్కలు.. పిల్లల జీవితానికి బంగారు బాటలు

రెండు చుక్కలు.. పిల్లల జీవితానికి బంగారు బాటలు

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ: రెండు చుక్కలు.. పిల్లల జీవితానికి బంగారు బాటలు అని భానాజీపేట గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రఘునాథపల్లి మండలం భానాజీపేట గ్రామంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో ప్రతి కుటుంబం తమ ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.

పోలియో చుక్కల ద్వారా పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగి, భవిష్యత్తులో అంగవైకల్యం బారిన పడకుండా రక్షణ లభిస్తుందని తెలిపారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ఏఎన్ఎం లు, ఆశా వర్కర్స్, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.