సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకున్ననటుడు బాబీ సింహ
మోపిదేవి, ఆంధ్రప్రభ : మోపిదేవి లోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తెలుగు, మలయాళం, కన్నడ భాషా సినిమా నటుడు బాబీ సింహ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు.

తొలుత నాగపుటంలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆయనకు స్వామివారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. జనసేన నాయకులు మండలి వెంకట్రామ్ ఆయనను కలుసుకున్నారు.
