పెద్ద తోక.. చిన్నపిట్ట.!
పెద్ద తోక.. చిన్నపిట్ట.!
- కనులకు ఇంపు..
- మధ్యప్రదేశ్ పక్షి కవ్వాల అభయారణ్యంలో ప్రత్యక్షం..
- అటవీ శాఖ అధికారి రామ్మోహన్ కెమెరాకు చిక్కిన పక్షి..
జన్నారం, ఆంధ్రప్రభ: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉండే పెద్ద తోక కలిగిన పిట్ట (పక్షి)ను జన్నారం అటవీ శాఖ అధికారి రామ్మోహన్ తన కెమెరాలో చిత్రీకరించారు. లోహపు నలుపు రంగు తల, జుట్టు కలిగి ఉండి, కంటిలో నీలం రంగు ఉండి చుట్టూ తెల్లని వలయ ఆకారంలో ఉన్న అందమైన ఏసియన్ పారడైజ్ ఫ్లై క్యాచర్ మధ్యప్రదేశ్ లో ఎక్కువ ఉంటాయి. అక్కడి పక్షులు మంచిర్యాల జిల్లా కవ్వాల టైగర్ రిజర్వు లోని జన్నారం అటవీ డివిజనల్ అడవుల్లో సంచరిస్తున్నాయి.
ఆ పక్షిని చూసినకొద్ధి కనులకు ఇంపుగా చూడబుద్ధి అవుతుంది. విధుల్లో భాగంగా అడవుల్లోకి వెళ్లిన అటవీ శాఖ అధికారి ఎం.రామ్మోహన్ కంటికి ఆ పక్షి కనిపించింది. వెంటనే ఆయన వద్ద ఉన్న కెమెరాలో ఆ అందమైన పక్షిని చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఎం.రామ్మోహన్ ఆదివారం ఉదయం మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్ రాష్ట్ర పక్షి ఇక్కడకి రావడం సంతోషకరమన్నారు. ఆ పక్షి గాలిలో ఎగిరే సీతాకోకచిలుకలను, మిడతలను, ఈగలను గాలిలోనే పట్టుకొని తింటుందని, ఆ పక్షి అత్యంత నేర్పుగలదని తెలిపారు.

