Results 2026 | టెన్త్ విద్యార్థులకు బిగ్ అప్‌డేట్

జూన్ 25 మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాల విడుదల
హాల్‌టికెట్ నంబర్‌తో ఆన్‌లైన్‌లో మార్కుల మెమో డౌన్‌లోడ్
సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థుల్లో ఉత్కంఠ
ఫలితాల కోసం విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్లను వినియోగించాలని సూచన

Results 2026 | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తెలంగాణ పదో తరగతి (టీఎస్‌ ఎస్‌ఎస్‌సీ) అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. 2026 సంవత్సరానికి సంబంధించిన సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను జూన్ 25న మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ విద్యాశాఖ విడుదల చేయనుంది. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్‌ను నమోదు చేసి ఆన్‌లైన్‌లో మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర ఫలితాల వెబ్‌పోర్టళ్లలో కూడా ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి.

అధికారిక వెబ్‌సైట్లు: BSE Telangana Official Website లేదా Results.Shikshaఇతర ప్రముఖ వెబ్‌సైట్: Manabadi

ఆన్‌లైన్‌లో ఫలితాలు ఇలా చూసుకోవాలి
విద్యార్థులు సంబంధిత వెబ్‌సైట్‌ను తెరిచి హోమ్‌పేజీలో కనిపించే ‘టీఎస్‌ ఎస్‌ఎస్‌సీ సప్లిమెంటరీ ఫలితాలు’ లింక్‌పై క్లిక్ చేయాలి. అనంతరం హాల్‌టికెట్ నంబర్‌ను నమోదు చేసి సబ్మిట్ బటన్ నొక్కగానే మార్కుల మెమో స్క్రీన్‌పై కనిపిస్తుంది. భవిష్యత్తు అవసరాల కోసం దానిని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

కీలక సూచన
ఫలితాల విడుదల సమయంలో వెబ్‌సైట్లపై అధిక ట్రాఫిక్ ఉండే అవకాశం ఉన్నందున విద్యార్థులు ఓపికగా ప్రయత్నించాలని అధికారులు సూచిస్తున్నారు. మార్కుల మెమోలో ఏవైనా వివరాలు తప్పుగా ఉన్నట్లయితే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు.