Nallamala | రహదారి సమీపంలో సంచారం
దోర్నాల-శ్రీశైలం మార్గంలోని తుమ్మల బయలు చెంచుగూడెం సమీపంలో సంచారం
రహదారి వద్దకు వచ్చిన అడవి దున్నను కెమెరాల్లో బంధించిన యాత్రికులు
Nallamala | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : నల్లమల అటవీ ప్రాంతంలో అరుదైన అడవి దున్న (గౌర్) దర్శనమివ్వడం విశేషంగా మారింది. శ్రీశైలం-దోర్నాల ప్రధాన రహదారిపై తుమ్మల బయలు చెంచుగూడెం సమీపంలో రహదారి వద్దకు వచ్చిన అడవి దున్నను యాత్రికులు గుర్తించి ఫోటోలు, వీడియోలు తీశారు.
శ్రీశైలం-దోర్నాల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో అడవి దున్న సంచారం కనిపించడం అరుదైన ఘటనగా స్థానికులు చెబుతున్నారు. తుమ్మల బయలు చెంచుగూడెం సమీపంలో రహదారి వద్దకు వచ్చిన ఈ అడవి దున్న కొద్దిసేపు అక్కడే సంచరించింది. అటుగా వెళ్తున్న యాత్రికులు దానిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే తమ మొబైల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు చిత్రీకరించారు. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులు సహజంగా సంచరిస్తుంటాయని, వాటికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా దూరం నుంచే వీక్షించాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు. నల్లమల అటవీ సంపద, జీవవైవిధ్యానికి ఈ ఘటన మరో నిదర్శనంగా నిలిచిందని పేర్కొంటున్నారు.
