ఇంటర్ విద్యార్థి ఆత్మ హత్య….

ఇంటర్ విద్యార్థి ఆత్మ హత్య….
వీరులపాడు, ఆంధ్రప్రభ : ఇంటర్ పరీక్ష ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని ఇంట్లో ఉన్న పురుగుమందు తాగి యువకుడు ఆత్మ హాత్యకు పాల్పడిన ఘటన వీరులపాడు మండలం జయంతి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ అభిమన్యు నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన గూడూరు యుగంధర్ రెడ్డి (18) విజయవాడ రూరల్ మండలం లోని నిడమానూరు నారాయణ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. కొద్దీ రోజుల క్రితం ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి.
ఉత్తీర్ణత పొందినప్పటికీ మార్కులు తక్కువ రావడంతో మనస్థాపనికి 794మార్కుల కంటే ఎక్కువ మార్కులు వస్తాయని ఆశించాడు. అప్పటినుంచి కుటుంబ సభ్యులతో ఎవరితో కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నాడని కుటుంబ సభ్యులు అన్నారు. గడచిన మూడు రోజుల క్రితం మృతుడు యుగంధర్ రెడ్డి తన స్వగ్రామం జయంతికి గ్రామం వచ్చి మానసికంగా బాధపడుతుంటే అతన్ని బాధపడవద్దని కుటుంబ సభ్యులు ఓదార్చరు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 10 : 30 గంటల సమయంలో ఇంట్లోఉన్న పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.
సమీపంలో ఉన్న కుటుంబ సభ్యులు హుటాహుటిన మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రి కి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి యుగంధర్ రెడ్డి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై తండ్రి రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అభిమన్యు తెలిపారు.
గ్రామంలో విషాదఛాయలు..
జయంతి గ్రామానికి చెందిన గూడూరు రామకృష్ణారెడ్డి కి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడైన గూడూరు యుగంధర్ రెడ్డి ఇటీవల కాలంలో ఇంటర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉన్నత చదువులు చదువుకొని కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు తమ కళ్ళ ముందే మృతి చెందటం తో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. యుగంధర్ రెడ్డి మృతి తో
జయంతి గ్రామం లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
