TG | ప్రభుత్వ అలసత్వం వ్యాపారులకు లాభాల పంట
TG | ప్రభుత్వ అలసత్వం వ్యాపారులకు లాభాల పంట
TG | ఇప్పటికీ 60 వేల బస్తాల నిలువలు
కొత్త బస్తాలు42 వేలు
ప్రభుత్వ ధర 2400 వ్యాపారుల ధర 1600 నుండి 1800 వరకు
లారీల కొరత హమాలీల కొరత
TG | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి ఆంధ్రప్రభ : మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వ అలసత్వం వల్ల వ్యాపారులకు లాభాల పంట పండింది రైతుకు భారీగా నష్టం వాటిల్లుతున్నది సమయానికి మొక్కజొన్న కొనుగోలు కాకపోవడంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాపారులకు అమ్ముకుంటున్నారు ప్రభుత్వ ధర 2400 ఉండగా వ్యాపారుల ధర 1600 నుండి 1800 వరకు కుంటున్నట్టు రైతులు చెప్తున్నారు దీనికి తోడు సంచుల కొరత లారీల కొరత రోజుల తరబడి మార్కెట్లో పడికాపులు కాయడం ఇలాంటి కష్టాల వల్ల తప్పించుకోవడానికి రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు ఆ వ్యాపారులు తామే లారీలు తెచ్చుకొని ఏ ఇబ్బంది లేకుండా తమ పంట పొలాల్లో వచ్చి మొక్కజొన్నను లారీల్లో నింపుకొని వెళ్లిపోతున్నారని రైతులు చెబుతున్నారు అయినా కొందరు వ్యాపారులు తాము ఇచ్చిన బకాయిల కింద ఆ వ్యాపారులు మార్కెట్లో పోసి రైతుల పేరు మీద టోకెన్ తీసుకొని మార్కెట్లో సంబంధిత సిబ్బందితో కుమ్మక్కై 2400 ధరకు అమ్ముతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

సంబంధిత ప్రజా ప్రతినిధులకు ఆ వ్యాపారులకు క్వింటాలకు 200 చొప్పున ఇస్తూ తమ పంటను వ్యాపారులు అమ్ముకుంటున్నారని ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ లెక్క ఈ ప్రకారం కనీసం గా వ్యాపారి 800 రూపాయలు లాభం పొందుతుండగా ఒక్కొక్క లారీకి 70000 లాభం ఆరిజిస్తున్నట్లు సమాచారం ఏ విధంగానైనా రైతే నష్టపోతున్నాడు గత నాలుగు రోజుల క్రితం నాగర్కర్నూల్ వ్యవసాయ మార్కెట్లో లక్ష బస్తాలకు పైగా మొక్కజొన్న నిల్వలు ఉండగా ప్రస్తుతం 60 వేల బస్తాలు నిలువ ఉన్నాయి కొత్తగా దాదాపుగా 42 వేల బస్తాలు రైతులు తీసుకువచ్చారు మళ్లీ యధావిధాగా దాదాపు లక్ష బస్తాలు నిలువ లు ఉన్నాయి దాదాపుగా 40 వేల బస్తాలు మూడు రోజుల నుండి తరలించినట్లు సహకార సంఘం అధికారి నరేష్ తెలిపాడు. ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నట్లు చెప్పిన సమస్య మాత్రం యధావిధిగాని మార్కెట్లోని మొక్కజొన్న నిల్వలను చూస్తే తెలుస్తుంది పాతవి తరలిస్తున్నారు.
కొత్తవి మొక్కజొన్న మార్కెట్లోకి వస్తుంది వేగవంతంగా యుద్ధ ప్రాతిపదికన ఒకేసారి పెద్ద ఎత్తున హమాలీలు లారీలు ఏర్పాటు చేసుకొని తరలింపు చర్యలు చేస్తే తప్ప మార్కెట్లో రైతులకు ఊరట వస్తుంది లేకపోతే రైతులు సంచులు కావాలి ఉప్పల కావలి ఉండవల్సిందే రైతుల బాధ ప్రత్యామ్నాయ చర్యలు దిగుమడికి అనుగుణంగా ప్రభుత్వం సమకూర్చకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని పరిస్థితిని అధిగమించడానికి నూతనంగా వచ్చిన జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశాలు చేసి సంబంధిత అధికారులకు రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్తున్నా ఆచరణలో మాత్రం కనిపించడం లేదు రైతుల పరిస్థితి యధావిధిగాని ఉంటున్నది పాత రైతులు వెళ్లిపోతుండగా కొత్త రైతులు తమ మొక్కజొన్నలు తీసుకొని వస్తున్నారు గతంలో కూడా వారం రోజులు మార్కెట్ యార్డ్ బందు ఉన్నది మళ్లీ ఇటీవల తెరిచినప్పటి నుండి దాదాపుగా లక్ష వరకు బస్తాలు నిల్వలు ఉంటూనే ఉన్నాయి ఈ పరిస్థితి ఎప్పుడు అధిగమిస్తుందో రైతుల కష్టాలు ఎప్పుడు తీరుస్తారు వేచి చూడాల్సింది ఉంది

