బోర్‌వెల్‌కు మరమ్మతులు చేయించిన సర్పంచ్..

బోర్‌వెల్‌కు మరమ్మతులు చేయించిన సర్పంచ్..
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని పెద్దూర్ గ్రామంలో మల్లవ్వ ఇంటి వద్ద గల బోర్‌వెల్ గత 15 ఏళ్లుగా చెడిపోయి మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో కాలనీవాసులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని స్థానిక వార్డు సభ్యుడు కత్తెరపాక రాజశేఖర్ పెద్దూర్ కడెం గ్రామ సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై స్పందించిన సర్పంచ్ విజయ్ కుమార్ ఆదివారం బోర్‌వెల్‌కు మరమ్మతులు చేయించారు. దీంతో కాలనీవాసులకు తాగునీటి సౌకర్యం కల్పించినట్లయింది. ఈ కార్యక్రమంలో పెద్దూర్ కడెం గ్రామ సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్, ఉప సర్పంచ్ పిట్టల రాజన్న, వార్డు మెంబర్ కత్తెరపాక రాజశేఖర్‌తో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.
