మంత్రిను కలిసిన పెన్నాహోబిలం దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్..

మంత్రిను కలిసిన పెన్నాహోబిలం దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్..

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : విజయవాడలోని మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ను మర్యాదపూర్వకంగా పెన్నాహోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రేగటి నాగరాజు కలిశారు. ఆయనకు సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రేగటి నాగరాజు మాట్లాడుతూ జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన పెన్నాహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి అభివృద్ధి చేయాలన్నారు.

స్వామివారి నూతన రథాన్ని తయారు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయ భాస్కర్, మాజీ సర్పంచ్ మోపిడి గోవిందు, మాజీ ఎంపీటీసీ పెంచలపాడు దేవేంద్ర, చీకులగురికి నాగేశ్వరరావు, పాల్తూర్ మారయ్య తదితరులు పాల్గొన్నారు.