అన్నదాతలకు అండగా నిలుస్తున్న జిల్లా పోలీసులు

అన్నదాతలకు అండగా నిలుస్తున్న జిల్లా పోలీసులు

  • ధాన్యం తరలింపులో కీలక పాత్ర
  • వేగవంతమైన చర్యలకు ఎస్పీ డాక్టర్ శబరీష్ శ్రీకారం
  • జిల్లా పోలీస్ బాటలోనే నర్సింహులపేట ఎస్ఐ వెంకన్న
  • అభినందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు

నర్సింహులపేట, ఆంధ్రప్రభ : ఇటీవల కాలంలో యూరియా,మొన్న పెట్రోల్ డీజిల్,నిన్న వంట గ్యాస్,నేడు ధాన్యం తరలింపులో కూడా కీలక పాత్ర పోషిస్తూ ప్రజల శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అన్నదాతలకు అండగా నిలుస్తూ సమన్వయపాత్ర పోషిస్తున్నారు మహబూబాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం.జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ రంగంలోకి దిగి కలెక్టర్ స్నేహశబరిస్ తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తున్నారు.రైతులను సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.

జిల్లా పోలీస్ బాటలోనే నర్సింహులపేట పోలీసులు

ఈ యేడాది మండలంలో మొక్కజొన్నల సాగు అధికంగా సాగు చేయడంతో జిల్లా అధికారులు,మార్క్ ఫెడ్ అధికారులు కలిసి మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించారు.దీంతో కొనుగోలు కేంద్రానికి విపరీతంగా రైతులు మక్కలను తీసుకువచ్చారు.వరికి కూడా ప్రభుత్వ మద్దతు కల్పిస్తున్నారని ధాన్యాన్ని కూడా తీసుకొచ్చారు. దీంతో భారీగా నిల్వలు పేరుకుపోయాయి.

రవాణా హమాలీల కొరత

ఈ రెండింటికి హమాలీల కొరత రవాణా మరియు గోదాముల నిల్వ లేకపోవడంతో దాన్యం తరలింపునకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రైతన్న ఆగం కాకుండా గ్రహించి నర్సింహులపేట పోలీసులు లారీల యజమానులతో మాట్లాడుతూ.. ప్రైవేట్ ట్రాక్టర్లతో పడమటిగూడెం పత్తి మిల్లుకు తరలించి బిహారీ హామాలీలను రప్పించి వేగంగా దిగుమతి చేయిస్తున్నారు.త్వరలోనే మక్కలను పూర్తిగా తరలించి ధాన్యాన్ని కూడా తరలించనున్నట్లు ఎస్సై వెంకన్న తెలిపారు.

Leave a Reply