ముఖ్యమంత్రి ఆశయాలను సాధిద్దాం..
ముఖ్యమంత్రి ఆశయాలను సాధిద్దాం..
స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం లో ప్రజలందరినీ భాగస్వామ్యం చేద్దాం..
ఆసుపత్రి అపరిశుభ్రంపై ఆగ్రహం..
రాష్ట్ర మంత్రి బీసీ..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రమంతా ప్రతి మూడవ శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల ఆరోగ్యం కోసం ఆయన ఆశయాన్ని అమలు చేసే విధంగా ప్రతి ఒక్కరము స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యం అవుదామని, ప్రతి ఒక్కరం ఆరోగ్యవంత మైన జీవనం గడుపుదాం అని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం బనగానపల్లె రెవిన్యూ డివిజన్ పరిధిలో ని సంజామల మండల కేంద్రంలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాల పరిరక్షణ, పెంపుదల లక్ష్యంగా చేపట్టిన ఇంకుడు గుంతల నిర్మాణ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు నీటి సంరక్షణ ప్రాధాన్యతను వివరించారు.

సంజామల మండల టిడిపి కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు విద్యార్థులు మానవహారంగా ఏర్పడి ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు, చెట్ల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ప్లాస్టిక్ వ్యతిరేక ర్యాలీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అనంతరం మంత్రి తో కలిసి విద్యార్థులు, ఉపాధ్యాయులు, కూటమి నాయకులు స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు.ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ, ప్లాస్టిక్ నిషేధానికి పూర్తి సహకారం అందించాలని షాపు యజమానులను కోరారు. రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ వినియోగంపై నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనుకాడరని మంత్రి హెచ్చరించారు.
సంజామల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు.ఆసుపత్రి పరిసరాలు, వార్డులను ప్రత్యేకంగా పరిశీలించరు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో రోగుల వార్డులో అపరిశుభ్రంగా చెత్త పేరుకుపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా చెత్తను తొలగించి పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చారు. అనారోగ్యం బారిన పడిన ప్రజలు ఆరోగ్యం కోసం వచ్చే ఆసుపత్రులను మరింత పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించరు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పలు అధికారులు వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.
