మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన పాలకవర్గం సభ్యులు..
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య క్రీడలు యువజన శాఖమంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరిని నారాయణపేట జిల్లా ఊట్కూర్ గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు శుక్రవారం కలిసి వినతి పత్రం సమర్పించిఘనంగా సన్మానించారు. ఊట్కూర్ పట్టణ అభివృద్ధికి సహకరించి నిధులు మంజూరుచేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం విజయవంతంగా చేపడుతున్నామని మంత్రికి వివరించారు.
గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కార మార్గాల గురించి మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఊట్కూర్ పట్టణం లో 16 వార్డులు ఉన్నాయని ఆయా వార్డుల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో పాటు వేసవిని దృష్టిలో ఉంచుకొని విద్యుత్, తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తూ గ్రామాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలనికోరారు. అందుకు మంత్రి వాకిటి శ్రీహరి సానుకూలంగా స్పందించి ఊట్కూర్ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఎం భరత్, వార్డు సభ్యులు పాల్గొన్నారు
