ఎంతటి వారైనా శిక్ష అనుభవించవలసిందే..

ఎంతటి వారైనా శిక్ష అనుభవించవలసిందే..

వెల్దండ, ఆంధ్రప్రభ : మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథను తక్షణమే అరెస్టు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.

మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. రక్షించవలసిన నాయకులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పై నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరమని మండిపడ్డారు. బేటి పడావో బేటీ బచావో… అనే నినాదం వినడానికి విడ్డూరమని అన్నారు. మహిళల పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తూ ప్రసంగాలు చేస్తున్న నాటి మహిళామణులు నేడు ఎక్కడ అని నిలదీశారు. మహిళల భద్రత పట్ల ప్రభుత్వం ఎలాంటి రాజీ పడకూడదని ఆయన స్పష్టం చేశారు. అధికార అండదండలు ఉన్నాయనే ధైర్యంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

నిందితుడిపై పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఘటన పై సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధితులు ఎంతటి వారైనా చట్టం ముందు సమానులే అని నిరూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి పదవి నుండి బండి సంజయ్ ని బర్త్ రఫ్ చేయాల తెలియజేస్తూ కుటుంబ సభ్యుల ప్రవర్తన కారణంగా ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బ తినడమే కాక, మహిళల భద్రత పై ప్రజల్లో ఆందోళన పెరుగుతోందని పేర్కొన్నారు. బాలికల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రతి పోలీస్ స్టేషన్‌లో మహిళా ఫిర్యాదుల పై వేగంగా స్పందించే ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని అన్నారు.

సమాజంలో మహిళల పట్ల గౌరవం పెంచేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, జోగయ్య, చంద్రమోహన్ రెడ్డి, జిల్లా నాయకులు నాగులు నాయక్, కొండల్ యాదవ్, గణేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply