12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి రహీం పటేల్ గెలుపు

మక్తల్ , ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 12వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన రహీం పటేల్ విజయం సాధించారు. కాంగ్రెస్ బిజెపి మధ్య పోరావోరుగా సాగిన పోరులో కాంగ్రెస్ అభ్యర్థి రహీం పటేల్ కి 672 ఓట్లు రాగా బిజెపి అభ్యర్థి బాల్చేడ్ మల్లికార్జున్ కు 363 ఓట్లు లభించాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి రహీం పటేల్ 308 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
