నిరుపేదలకు వైద్యసాయం.. రూ.10 లక్షలకు పైగా ఎల్‌ఓసీలు పంపిణీ
భవానిపురం, ఆంధ్రప్రభ: నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందేలా ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసీ) పత్రాలను మంజూరు చేస్తూ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు ఆయన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నాయకులతో కలిసి భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో బాధితులకు ఎల్‌ఓసీ పత్రాలను అందజేశారు.
43వ డివిజన్ ఊర్మిళనగర్‌కు చెందిన ఓగిరాల రాజేశ్వరి గర్భాశయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ వైద్యసాయం కోసం దరఖాస్తు చేసుకోగా, రూ.1.87 లక్షల విలువైన ఎల్‌ఓసీని అందజేశారు. అలాగే 34వ డివిజన్ కేదారేశ్వరపేటకు చెందిన 71 ఏళ్ల కే. జోజమ్మ దీర్ఘకాలిక శ్వాసకోశ సంబంధిత వ్యాధితో చికిత్స పొందేందుకు దరఖాస్తు చేసుకోగా, రూ.8.26 లక్షల విలువైన ఎల్‌ఓసీని అందించారు.
త్వరితగతిన స్పందించి వైద్యసాయం అందించిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధితులు, వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వీరబాబు స్వామి దేవస్థానం అధ్యక్షుడు కొమ్మూరు బసవరాజు, కూటమి నాయకులు గోవిందమ్మ, బొల్లేపల్లి కోటేశ్వరరావు, ఆకుల రవిశంకర్, పగడాల కృష్ణా, రుద్రపాటి వెంకటేష్, పచ్చవ మల్లికార్జునరావు, సుజనా మిత్ర కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

