కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ట్రెసా నూతన కార్యవర్గం
జిల్లా అధికారులతో సమావేశమైన తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ నాయకులు
రేగొండ, ఆంధ్రప్రభ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ (ట్రెసా) నూతన కార్యవర్గం బుధవారం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ), అదనపు కలెక్టర్ (ఎల్‌బీ), కలెక్టరేట్ పరిపాలనాధికారిని మర్యాదపూర్వకంగా కలిసింది.
ఈ సందర్భంగా ట్రెసా నూతన అధ్యక్షుడు మేకల రాజ్ ప్రకాష్ నేతృత్వంలో సంఘం ప్రతినిధులు అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సంఘం కార్యకలాపాలు, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రెసా జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్ రజాక్, అసోసియేట్ అధ్యక్షులు ఎస్‌కే అబ్బాస్, ఎ. నాగరాజు, జె. నరేష్ కుమార్, టి. సాగర్, సువర్ణ, ఖజానాదారు పి. రాజయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి పి. ఉదయ్ కుమార్, బి. సతీష్, క్రీడలు–సాంస్కృతిక కార్యదర్శి పి. రమేష్, సంయుక్త కార్యదర్శులు ఎన్. శ్రీనివాస్, బి. వెంకటేష్, ఎస్. శ్రీనివాస్, మౌనిక, కార్యవర్గ సభ్యులు ఎండీ. రెహ్మత్ ఫాషా, ఎం. అశోక్, వేణు, జి. పవన్ కుమార్, శివరామకృష్ణ, బి. శ్రీనివాస్, జె. సరస్వతి పాల్గొన్నారు.
టీఎన్‌జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు షఫీ మహ్మద్‌తో పాటు ఇతర నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
