ఎన్డీఏ కార్యాలయంలో ప్రజా దర్బార్..

ఎన్డీఏ కార్యాలయంలో ప్రజా దర్బార్..
వినతులు స్వీకరించిన కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
భవానిపురం, ఆంధ్రప్రభ: ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలు, వినతులను కూటమి నేతలకు సమర్పించారు. నూతన ఇళ్ల మంజూరు, కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, సామాజిక పెన్షన్లు, తాగునీటి సమస్యలు తదితర అంశాలపై వినతులు అందాయి.
కొన్ని సమస్యలను కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన వినతులను తక్షణమే పరిశీలించి చర్యలు తీసుకుంటామని నేతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పీవీ చిన సుబ్బయ్య, గంజి పవన్, ఏలూరు సాయి శరత్, శనివారపు శివ, గన్నవరపు శ్రీనివాసరావు, ఈగల సాంబశివరావు, దాడి మురళీకృష్ణ, నక్కెట్ల రాజా, శ్యామ్ మారేపల్లి, మలపరెడ్డి అప్పారావు, గాడు గణేష్, సీ హెచ్ రామనాయుడు, గూడూరు కొండయ్య, వీఆర్వో నాని కుమార్ తదితరులు పాల్గొన్నారు.
