ప్రజాదర్బార్ కు అనూహ్య స్పందన
భవానీపురం, ఆంధ్రప్రభ: ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం,ఎన్డీయే కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ లకు ప్రజలనుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు మహ్మద్ అబ్దుల్ ఖాదర్, పత్తి నాగేశ్వరరావు, గుడివాడ నరేంద్ర రాఘవ, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు, జనసేన నాయకులు పల్లంటి ఆది, పులిచేరి రమేష్, ఏలూరు సాయి శరత్, బీ జే పీ నాయకులు యర్రం శెట్టి విశ్వేశ్వరరావు,రుద్రపాటి వెంకటేష్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వారి సమస్యలను తెలిపారు.
ప్రభుత్వ పథకాలు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, వైద్య సహాయం , స్థానిక సమస్యలపై ప్రజలు ప్రత్యేకంగా దరఖాస్తులు అందజేశారు. వచ్చిన వినతులపై ప్రత్యేక దృష్టి సారించి అర్హులకు న్యాయం జరిగేలా ఎమ్మెల్యే సుజనా చౌదరి చర్యలు తీసుకుంటున్నారని కూటమి నేతలు మహ్మద్ అబ్దుల్ ఖాదర్, దాడి అప్పారావు, యర్రం శెట్టి విశ్వేశ్వరరావు తెలిపారు.
