మొక్కజొన్న రైతుల గోస…

మొక్కజొన్న రైతుల గోస…

20 రోజులైనా మొక్కజొన్న తరలించని అధికారులు
ఎండనక గాలి అనక పడికాపులు కాస్తున్న రైతులు
పట్టించుకోని అధికారులు ప్రజాప్రతినిధులు
రోజుల తరబడి మార్కెట్ యార్డ్ లో రైతుల ఎదురుచూపులు
రైతుల సమస్య ఏనాటికి పరిష్కారమయ్యేను
ఆందోళనలో రైతన్నలు
వర్షం పడితే మా గతి అధోగతే..

నాగర్ కర్నూల్ జిల్లా, ఆంధ్రప్రభ : మొక్కజొన్న రైతుల గోస చెప్పనలవి కాదు ఎండనక వాడనక వాననక పడికాపులు కాస్తూ తమ మొక్కలను ఎప్పుడు తరలిస్తారో మాకు విముక్తి ఎన్నడూ అని రైతులు వాపోతున్నారు. రోజుల తరబడి నాగర్ కర్నూల్ మార్కెట్ యార్డులు రైతులు తమ మొక్కజొన్నలు పోసి సంచులకు ఎత్తి కుట్టువేసి కవర్లు కప్పి లారీలో ఎత్తడానికి లారీలు రాక రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు.

వారం రోజుల నుండి 2026 రోజుల వరకు సంచులు దగ్గర కాపలాకాస్తు లారీలకు ఎత్తేందుకు ఎప్పుడు ఎక్కుతారా అని ఎదురుచూస్తున్న రైతుల బాధలు వర్ణనాతీతం ఎప్పుడు వర్షం వస్తుందా ఎప్పుడు సంచులు తడుస్తాయా అనే ఆందోళనలో మార్కెట్ యార్డ్ లో రైతులు బిక్కుబిక్కుమంటు కాపలా కాస్తున్నారు. అయినా అధికారులు మార్క్ఫెడ్ పిఎసిఎస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మార్కెట్ యార్డ్ లోని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్ యాల్లో సింగల్ విండో సొసైటీ ద్వారా మార్క్ఫెడ్ మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది దాదాపుగా 20 రోజుల నుండి మొక్కజొన్నలు అలాగే సంచులలో కొన్ని నిల్వ ఉండగా కొన్ని కబుర్లు కప్పుకొని కుప్పలు ఉన్నాయి దాదాపుగా 74 వేల పంచులు మొక్కజొన్న విత్తనాలు పంట నిల్వ ఉన్నాయి. 30 వేల సంచులు కాంటా కానివి ఉన్నాయి ప్రతిరోజు ఆరు ఏడు లారీల కంటే ఎక్కువ తరలిస్తున్నారు.

అలా తరలించినా కూడా ఇప్పటికీ 50 50 వేల చింతాల మొక్కజొన్న క్వింటాళ్ల మొక్కజొన్న మార్కెట్ యార్డ్ లో నిల్వలు ఉన్నాయి ఇవి ఎప్పుడు తరలిస్తారో రైతులకు ఎప్పుడు విముక్తి అవుతుందో అని ఆందోళన చెందుతున్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపం లారీలను తెప్పించడంలో విఫలం తరలించడంలో విఫలం ఇలా సమన్వయం లేక మేనేజ్మెంట్ కొరవడి దాదాపుగా 15 రోజుల నుండి రైతాంగం తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నాయి. అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఇన్ని రోజులైనా కూడా మార్కెట్ యార్డ్ ను సందర్శించి ఇక్కడే ఉండి సమస్య పరిష్కారం కోసం కృషి చేయడం లేదని తమ కష్టాలను తీర్చడం లేదని పలు గ్రామాల రైతులు వాపోతున్నారు.

ఏం ప్రభుత్వమో ఏమి ఎమ్మెల్యేను ఏం అధికారులు తెలియడం లేదని తమ ఘోష బాధ ఆందోళన పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. వనపట్ల గ్రామానికి చెందిన చిక్కొండ ఎల్లయ్య అనే రైతు మాట్లాడుతూ ఇప్పటికీ 20 రోజులైంది తమ బస్తాలు ఎత్తడం లేదని వాపోయాడు నంది వడ్డేమాన్ కు చెందిన రాహుల్ అనే రైతు 16వ తేదీ నాడు మొక్కజొన్న కాంటా అయితే ఇప్పటివరకు ఎత్తలేదని ఆనాటి నుండి ఈనాటి వరకు ఎండనక వాననక గాలి దుంగారానికి కూడా మార్కెట్ యార్డ్ లోనే పడి సస్తున్నామని మా గోస పట్టడం లేదని వాపోయాడు.

కుడుకుర్తి గ్రామానికి చెందిన సీను అనే రైతు 21 రోజులు అయింది. మొక్కజొన్నలు తెచ్చి ఇప్పటివరకు 500 కింటాలు ఉన్నాయని ఇప్పటివరకు ఎత్తలేదు అని ఆందోళన వ్యక్తం చేశారు వనపట్ల గ్రామానికి చెందిన చంద్రయ్య అనే రైతు ఆరు రోజులు అయ్యింది. ఇప్పటివరకు మార్కెట్ యార్డ్ లో బయట ఎండ పోశామని ఇప్పటివరకు కొనుగోలు చేయలేదని ఆందోళన వాపోయాడు ఇలా పదుల సంఖ్యలో రైతులు తమ ఘోష పడుతూ మార్కెట్ యార్డులో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి బాధ్యులు ఎవరు ఈ కష్టాలు తీరేది ఎన్నడు అని రైతాంగం వాపోతున్నది.

Leave a Reply