అనుమతి లేకుండా చెట్టు నరికివేత.. రూ.2,500 జరిమానా

అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణంలోని సుప్రీమ్ వైన్స్ పర్మిట్ రూమ్ సమీపంలో ఉన్న చెట్టును అనుమతి లేకుండా నరికివేసిన ఘటనపై మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు.

శానిటరీ ఇన్‌స్పెక్టర్ గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో చెట్టు నరికివేసినట్లు గుర్తించి, సంబంధిత సుప్రీమ్ వైన్స్ పర్మిట్ రూమ్ నిర్వాహకుడు పాండుకు రూ.2,500 జరిమానా విధించారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా అనుమతి లేకుండా చెట్లను నరికితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.