క్రీడాభివృద్ధికిప్రతిఒక్కరూ సహకరించాలి..

క్రీడాభివృద్ధికిప్రతిఒక్కరూ సహకరించాలి..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహదపడుతుందని క్రీడాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలనిపెద్దపోర్ల సర్పంచ్ బోయిన్ పల్లి కాశమ్మఅన్నారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోనిపెద్దపోర్లలో మేరా యువభారత్ ఆధ్వర్యంలో యువ మండల వికాస్ అభియాన్ కార్యక్రమం నిర్వహించి క్రీడాకారులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్, మేరా యువభారత్ జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, గ్రామాల్లో ఉన్న యువజన సంఘాలను మేరా యువభారత్‌తో అనుసంధానం చేస్తున్నామన్నారు. ఈ అనుసంధానం ద్వారా యువజన సంఘాలకు అనేక అవకాశాలు, ప్రోత్సాహం లభిస్తాయని అన్నారు.
యువజన సంఘం సభ్యులకు వాలీబాల్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, ఫ్రిస్బీ, స్కిప్పింగ్ వంటి క్రీడా సామగ్రిని వాల్మీకి, వివేకానంద యూత్ లకు క్రీడా సామగ్రిని పంపిణీ చేసినట్లు తెలిపారు. మేరా యువభారత్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చాలా గర్వకారణం అని, గ్రామ యువతలో క్రీడా స్పూర్తిని పెంపొందించడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. పలు యువజన సంఘాలకు క్రీడా సామగ్రి పంపిణీ చేయడం చాలా అభినందనీయమని క్రీడాకారులను ప్రోత్సహిస్తూ యువజన సంఘాలను బలోపేతం చేసివారిని సామాజిక సేవా కార్యక్రమాల వైపు ప్రోత్సహిస్తాయనిప్రశంసించారు. ఈ కార్యక్రమంలోమాజీ సర్పంచ్ రవికుమార్, సి ఆర్ పి రాజశేఖర్, నరేష్ గౌడ్,వార్డ్ మెంబర్ రమేష్,బీజేపీ బూత్ అధ్యక్షుడు శివ గౌడ్, యువనాయకులు బోయిన్ పల్లి నరేష్, కృష్ణయ్య, సంటి రవి, సత్యం అంజి, వరప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
