మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సన్మానించిన మార్కెట్ చైర్మన్

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సన్మానించిన మార్కెట్ చైర్మన్
మోత్కూర్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డిని మోత్కూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నూనెముంతల విమల వెంకటేశ్వర్లు గౌడ్ సన్మానించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మోత్కూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నూనెముంతల విమల వెంకటేశ్వర్లు గౌడ్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.
