Weekend Getaway | గోదావరి తీరంలో అద్భుతమైన వన్యప్రాణుల స్వర్గధామం

Weekend Getaway | గోదావరి తీరంలో అద్భుతమైన వన్యప్రాణుల స్వర్గధామం
Weekend Getaway | గోదావరి ఒడ్డున మొసళ్ల అద్భుత ప్రపంచం
శివారం ప్రత్యేకతలు మరియు జీవవైవిధ్యం
ప్రకృతి మధ్య ప్రశాంతమైన అనుభవం
ఆదిలాబాద్ ఎకో టూరిజంలో శివారం ప్రాధాన్యం
పర్యావరణ సంరక్షణలో పర్యాటకుల బాధ్యత
Weekend Getaway | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మీరు సాహస ప్రియులైనా, ప్రకృతి ప్రేమికులైనా.. ఒక్కసారైనా శివారం తీరానికి వెళ్లి ఆ గోదావరి గలగలలను, మొసళ్ల విన్యాసాలను చూడాల్సిందే! ఒక అద్భుతమైన ‘వీకెండ్ గేట్‌వే’ కోసం చూస్తున్నారా? అయితే మీ ట్రిప్ ఆదిలాబాద్, మంచిర్యాల వైపు ప్లాన్ చేయండి!
గోదావరి పరవళ్లు తొక్కే మందమర్రి తీరంలో, ప్రకృతి తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. అదే శివారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. కాంక్రీట్ అడవుల మధ్య యాంత్రికంగా బతుకుతున్న మనకు, అసలైన అడవి అందం అంటే ఏమిటో, అక్కడి జీవవైవిధ్యం ఎంత అమూల్యమైనదో ఈ ప్రాంతం గుర్తు చేస్తుంది.
మంచిర్యాల జిల్లాలో విస్తరించి ఉన్న ఈ అభయారణ్యం విశేషాలు చూసొద్దాం రండి.

Weekend Getaway | గోదావరి అలలపై ‘మొసళ్ల’ కొలువు, శివారం అభయారణ్యం
సాధారణంగా అభయారణ్యం అనగానే మనకు దట్టమైన అడవులు, కొండలు, గుట్టలు గుర్తొస్తాయి. కానీ శివారం ప్రత్యేకం. ఇక్కడ అడవికి తోడుగా గోదావరి నది తన పాయలతో తోడవుతుంది. అందుకే ఇది కేవలం జంతువులకే కాదు, అనేకరకాలైన జలచరాలకు కూడా స్వర్గధామంలాంటిదని చెబుతారు.
ప్రత్యేకంగా మొసళ్లకు పట్టుకొమ్మ శివారం..అందుకే మనకు శివారం అనగానే ముందుగా గుర్తొచ్చేవి మొసళ్లు. ఇక్కడ గోదావరి తీరంలో మగ్గర్ జాతికి చెందిన మొసళ్లు భారీ సంఖ్యలో కనిపిస్తాయి. నది ఒడ్డున ఇసుక తిన్నెలపై ఎండ కాచుకుంటూ పడుకున్న మొసళ్లను చూడటం పర్యాటకులకు ఒక థ్రిల్లింగ్ అనుభవం. వీటి సంరక్షణ కోసమే 1978లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేవలం చూడటానికే కాదు, వీటి సంతానోత్పత్తికి ఇక్కడి వాతావరణం ఎంతో అనుకూలమైనది.

Weekend Getaway | ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన అద్భుత దృశ్యం
ఈ అభయారణ్యం అంటే కేవలం మొసళ్లకే పరిమితం కాదు. గోదావరి నదికి ఇరువైపులా ఉన్న దట్టమైన అడవిలో టేకు, వెదురు చెట్ల మధ్య కృష్ణజింకలు, సాంబార్ లేళ్లు, అడవి పందులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. అదృష్టం బాగుంటే అరుదైన చిరుత పులుల అడుగుజాడలు కూడా మనకు కనిపిస్తాయి. ఇక పక్షుల కిలకిలారావాల గురించి చెప్పక్కర్లేదు. శీతాకాలంలో విదేశాల నుంచి వచ్చే వలస పక్షులతో ఈ ప్రాంతం ఒక వర్ణరంజితమైన చిత్రపటంలా అద్భుతంగా కనిపిస్తుంది మనకు.

Weekend Getaway | ఆదిలాబాద్ పర్యటన అంటేనే ఎకో-టూరిజం
ఆదిలాబాద్ లోని ప్రాకృతిక అద్భుతాలు ఒక మధురానుభూతి. యాంత్రిక జీవనం నుండి కాసేపు విరామం కోరుకునే వారికి శివారం ఒక అద్భుతమైన ప్రదేశం. గోదావరి నదీ తీరాన నడుస్తూ, కిలకిలారావాల పక్షుల పాటలు వింటూ, స్వచ్ఛమైన గాలిని పీలుస్తుంటే కలిగే మానసిక ప్రశాంతత మాటల్లో వర్ణించలేం. ఇక్కడికి దగ్గరలో ఉన్న కాళేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలు సందర్శించే వారు కూడా శివారం అందాలను చూడకుండా వెనుదిరగరు.

Weekend Getaway | పర్యావరణ సంరక్షణ మన బాధ్యత
శివారం వంటి అభయారణ్యాలు మన పర్యావరణ సమతుల్యతకు చిహ్నాలు. నది కలుషితం కాకుండా చూడటం, అడవులను సంరక్షించుకోవడం మన బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అక్కడి అందాలను ఆస్వాదించడమే కాదు, ప్రకృతిని కాపాడడం కూడా పర్యటకుల బాధ్యగా గుర్తెరిగి ప్రవర్తించాలి. ప్లాస్టిక్ రహిత పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ, ఈ సహజ సంపదను రేపటి తరాలకు అందించాల్సిన అవసరం ఎంతో కీలకం.
click here to read నాటుసారాయి స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు
