మహాత్మా బసవేశ్వరుని ఆలోచనలు ఆచరణీయం..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; గొప్ప సంఘసంస్కర్త మహాత్మా బసవేశ్వరుని బోధనలు ఆచరణీయమని వీరసేవ వీరశైవ లింగయాత్ అధ్యక్షులు ప్రభు లింగం, ఉప సర్పంచ్ రమేష్, మాజీజెడ్పిటిసిలు సూర్యప్రకాశ్ రెడ్డి, అరవింద్ కుమార్, మాజీ సర్పంచ్ ఎం. భాస్కర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు యగ్నేశ్వర్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఎం.భరత్ అన్నారు. సోమవారం బసవేశ్వర జయంతి వేడుకలను పురస్కరించుకొని నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బసవేశ్వర విగ్రహానికి ప్రత్యేక పూజలునిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంఘసంస్కర్త సమసమాజ నిర్మాణం కోసం పనిచేసిన బసవేశ్వరుడు అందరివాడని సమాజంలోని అందరూ గౌరవించాల్సిన అవసరంఉందన్నారు. బసవ జయంతి వేడుకలను పురస్కరించుకొని దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూగ బసవేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానంచేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు నీలిరాజు, సురేష్ లింగం, నాగభూషణం, సురేష్, అనిల్, మల్లికార్జున్, ఆయా పార్టీల నాయకులు ఎల్కోటి జనార్దన్ రెడ్డి, ఆశప్ప, బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.