బుచ్చయ్యపల్లి అంగన్‌వాడీలో చిన్నారులకు అక్షరాభ్యాసం
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మండలంలోని బుచ్చయ్యపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం చిన్నారులకు ఘనంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ జాడి మహేశ్వర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ విష్ణుప్రియ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిన్నారులతో అక్షరాలు దిద్దించి విద్యాభ్యాసాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్నారి దశలోనే అక్షర జ్ఞానం అందించడం వల్ల వారి భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని, విద్యా సౌకర్యాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీఎస్ బుచ్చయ్యపల్లి హెచ్ఎం రమేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీలత, అంగన్‌వాడీ టీచర్ మల్లేశ్వరి, అసిస్టెంట్ లక్ష్మి, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
