బీఆర్ ఎస్ వీ నేతల అరెస్ట్…

బీఆర్ ఎస్ వీ నేతల అరెస్ట్…

క్యాతన్ పల్లి ఆంధ్రప్రభ : ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ బి ఆర్ ఎస్ వి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ముట్టడికి వెళ్లకుండా పోలీసులు అర్ధరాత్రి 12 గంటలకు ముందస్తుగా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్, జిల్లా నాయకులు జిలకర మహేష్, నస్పూరి శివ కుమార్, కుర్మ దినేష్‌లను అరెస్టు చేసి ఆర్కేపీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రామకృష్ణ పూర్ పోలీస్ స్టేషన్లో వారు మాట్లాడుతూ అక్రమ అరెస్ట్‌లతో విద్యార్థి ఉద్యమాలను ఆపలేరని, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ, మైనారిటీ విద్యార్థులను, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చదువుకు దూరం చేస్తుందని అన్నారు. విద్యాశాఖకు 8% నిధులు కేటాయించడమే అని, గత 2 సంవత్సరాలుగా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయడం లేదని అన్నారు. వెంటనే విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Leave a Reply