హత్యాయత్నం కేసులో ప్రియుడు ప్రియురాలు అరెస్టు..
టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని వెంకట్రావుపల్లి (బి) గ్రామానికి చెందిన బచ్చల చిన్న రవిపై హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై అమూల్య తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. బచ్చల చిన్న రవి, భార్య లక్ష్మి, తన ప్రియుడు ఈర్ల రవితో కలిసి భర్తను హత్య చేయడానికి కుట్ర పన్నింది. తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడనే కారణంతో బుధవారం రాత్రి భర్త నిద్రిస్తున్న సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించింది.
అనంతరం భర్త కాళ్లకు విద్యుత్ తీగలు అమర్చి విద్యుత్ షాక్ తో హత్య చేయాలని ప్రయత్నించారు. అయితే, ఆ సమయంలో చిన్న రవికి స్పృహ రావడంతో వెంటనే స్థానికులను అప్రమత్తం చేశాడు. దీంతో నిందితులు అక్కడి పరారయ్యారు. బాధితుడు బచ్చల చిన్న రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, హత్యాయత్నానికి పాల్పడిన లక్ష్మి, ఈర్ల రవిని అరెస్టు చేసి వారిని రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై అమూల్య వెల్లడించారు.
