ఒడిశాను ముంచెత్తిన వరదలు..

  • ఉగ్రరూపం దాల్చిన గుండిచా ఘాఘీ జలపాతం….

ఆంధ్రప్రభ : ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కేందుజార్ జిల్లాలోని ప్రసిద్ధ గుండిచా ఘాఘీ జలపాతం ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం తీవ్రంగా ఉండటంతో… సాధారణంగా ప్రత్యేకంగా కనిపించే ఆ జలపాతం… భ‌యాన‌కంగా క‌నిపిస్తుంది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్ గా మారింది.

బైతరణి నదికి ఉపనదైన ముసాలా నదిపై ఉన్న ఈ జలపాతం వద్ద నీటి ఉద్ధృతి కొనసాగుతుండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని పర్యాటకులు, స్థానికులు జలపాతం పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు.