సుదర్శన్‌రెడ్డికి కవిత పరామర్శ
త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన కవిత
యశోద ఆస్పత్రిలో మాజీ ఎమ్మెల్యే ఆరోగ్యంపై ఆరా
కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన తెలంగాణ రక్షణ సేన చీఫ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్‌రెడ్డికి అందిస్తున్న వైద్య చికిత్స, ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చికిత్సకు ఆయన ఎలా స్పందిస్తున్నారనే అంశంపై వైద్యులతో చర్చించారు.

అనంతరం పెద్ది సుదర్శన్‌రెడ్డి భార్యతో పాటు ఇతర కుటుంబ సభ్యులను కలిసిన కవిత వారికి ధైర్యం చెప్పారు. చికిత్సపై ఆందోళన చెందవద్దని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సుదీర్ఘకాలంగా తెలంగాణ ఉద్యమంలో తనతో కలిసి పనిచేసిన సహచర ఉద్యమకారుడైన పెద్ది సుదర్శన్‌రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కవిత వెంట పలువురు తెలంగాణ రక్షణ సేన, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా ఆస్పత్రికి వెళ్లి పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.


