యూరియా యాప్ పై తిరుగుబాటు..

వేల్పూర్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలంలో అంక్సాపూర్ నేషనల్ హైవే పై గ్రామ రైతన్నలు యూరియా యాప్ ఎత్తివేయాలని రోడ్డుపై ధర్నా, పాత పద్ధతిలోయూరియా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు..రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ డౌన్లోడ్ డౌన్ డౌన్ కలెక్టర్ రావాలి యూరియా ఇప్పించాలని నినాదాలు చేస్తూ రోడ్డు దిగ్బంధం చేశారు. రైతులు మాట్లాడుతూ.. యూరియా యాప్ తో చాలా ఇబ్బందిగా ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా యాప్ తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్మూర్ రూరల్ సిఐ జన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు రైతులకు మాట ఇచ్చి రెపటి లోపు 6 లారీలు యూరియా అంక్సాపూర్ గ్రామంలో తెప్పిస్తానని సిఐ హామీ ఇవ్వడంతో యూరియా రైతన్నలు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలోగ్రామ రైతులు ఉన్నారు..

Leave a Reply