అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

తొర్రూరు, ఆంధ్రప్రభ : అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మడిపల్లి సర్పంచ్ నలుగురి రామలింగం అన్నారు. సోమవారం మండలంలోని మడిపల్లి ఉన్న అంగన్వాడి కేంద్రంలో భూషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య లక్ష్మి కమిటీ సమావేశం ఏర్పాటు చేసి పౌష్టిక ఆహారాలను అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ రామలింగం మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రాలలో ప్రభుత్వం అందించే పౌష్టిక ఆహారాలను తీసుకోవాలని, అంగన్వాడి సెంటర్లలో ప్రభుత్వం అందించే పౌష్టిక ఆహారాలను సక్రమంగా అందించాలని కోరారు. అంగన్వాడి సెంటర్లను చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు అరుణమ్మ, ఉదయశ్రీ,సుజాత, ఆశ వర్కర్లు ఉమా,ఉపేంద్ర, ఆయాలు సరిత, సోమలక్ష్మి, సమ్మక్క, గర్భిణీలు, బాలింతలు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
