దీర్ఘకాల లీజులొద్దు

  • 3 తీర్మానాలు తిరస్కరణ
  • ఆ తీర్మానాలపై ఆలోచిద్దాం
  • దుర్గగుడి పాలక మండలి సమీక్ష

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : నిత్యం వేల సంఖ్యలో రాష్ట్రం నలుమూలలతో పాటు దేశం నలుమూలల నుండి కనకదుర్గ అమ్మవారి దర్శనానికి తరలివచ్చే భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు భక్తులు, ఆలయ భద్రత కు పెద్ద పేట వేయాలంటూ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పాలకమండలి నిర్ణయించింది.

ఇటీవలే నూతనంగా బాధ్యతలు స్వీకరించిన దుర్గగుడి పాలకమండలి సర్వసభ్య సమావేశం నగరంలోని జమ్మిదొడ్డి సెంటర్లో ఉన్న సమావేశ మందిరంలో పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణ అధికారి శీనా నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు.

ఈ సర్వసభ్య సమావేశంలో 24 తీర్మానాలపై సుదీర్ఘంగా సభ్యులు చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో అతి ముఖ్యమైన ఆలయ ఆస్తులకును దీర్ఘకాలిక లీజుకు ఇచ్చే అంశంపై అభ్యగ్రాలు తలెత్తడంతో ఆ తీర్మానాలను తిరస్కరించారు.

ముఖ్యంగా కొండపైన ఇటీవల కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ విక్రయించేందుకు నిర్వహించిన టెండర్ లో కేటాయించాల్సిన షాపుకు సంబంధించిన వ్యవహారంలో భక్తుల భద్రత దృష్ట్యా టెండర్ ను రద్దు చేస్తూ తీర్మానించారు.

విజయవాడలోని దేవాలయాలకు సంబంధించిన సూర్యరావుపేటలో ఉన్న 400 ఖాళీ స్థలము టెండర్ ప్రక్రియ ద్వారా 11 సంవత్సరాల కార పరిమితికి లీజుకు ఇచ్చేందుకు తీసుకున్న తీర్మానాన్ని సభ్యులు పరిశీలించిన తరువాత నిర్ణయం తీసుకోనున్నారు.

విజయవాడ రూరల్ పరిధిలోని గూడవల్లి గ్రామంలో 66 సెంట్లు ఖాళీ స్థలం కూడా 11 సంవత్సరాల కాలపరిమితికి లేచికు ఇచ్చే అంశాన్ని కూడా సభ్యులు పరిశీలించిన తర్వాత బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే విధంగా సభ్యులు నిర్ణయించారు.

అమ్మవారి భక్తులకు అన్నప్రసాద వితరణలో కోరల పదార్థాలను అదనంగా అడిగిన భక్తులకు వడ్డెన కోసం అవసరమైన కూరగాయల దిట్టము పెంచేందుకు అయిన ఖర్చుల ఆమోదం కోసం వచ్చిన తీర్మానాన్ని ట్రస్ట్ సభ్యులు ఏకగ్రీవంగా తిరస్కరించి ప్రస్తుతం జరుగుతున్న విధానంలోనే కొనసాగించాలని తీర్మానించారు.

వీటితోపాటు ఇటీవల దసరా ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటుచేసిన శ్యామ్యానాలు క్యూలైన్లు లైటింగ్ టెండర్లకు సంబంధించి మూడు కోట్ల రూపాయల విలువైన చెల్లింపుకు ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ఆమోదం తెలిపారు. అలాగే ఇంజనీరింగ్ విభాగం సూచించిన ఆలయంలోని పలు ప్రాంతాలలో భక్తుల సౌకర్యం కోసం మౌలిక సదుపాయాల కల్పన కోసం అవసరమైన నిధులు మంజూరుకు చేసిన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. భవాని దీక్షల విరమణ సందర్భంగా చేస్తున్న ఏర్పాటులకు సంబంధించి అవుతున్న ఖర్చులను కూడా ట్రస్ట్ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఖర్చులు తగ్గించాలి…

అమ్మవారి ఆలయంలో జరుగుతున్న ఖర్చులపై ప్రత్యేక నియంత్రణ ఉండాలని పాలకవర్గ సమావేశం సందర్భంగా పలువురు సభ్యులు చైర్మన్ తో పాటు ఈవో దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల దుర్గ గుడి ఉత్సవాల సందర్భంగా చేసిన ఏర్పాట్లు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తే భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతున్న దృష్ట్యా అన్నింటికీ ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయాన్ని వెల్లడించారు. లైటింగ్ తో పాటు తాత్కాలిక శ్యామ్యానాలు వంటి ఖర్చుల పై నియంత్రణ అవసరమని అభిప్రాయపడ్డారు.

Leave a Reply