Lives | లిఫ్ట్‌లో చిక్కుకుని ఐదేళ్ల చిన్నారి….

Lives | లిఫ్ట్‌లో చిక్కుకుని ఐదేళ్ల చిన్నారి….
Lives | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గౌలిదొడ్డిలోని ఓ ప్రైవేట్ లేడీస్ హాస్టల్‌లో లిఫ్ట్‌లో చిక్కుకుని ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
గౌలిదొడ్డిలోని హాస్టల్‌లో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న బిస్తు ఘోష్ అనే ఐదేళ్ల చిన్నారి ఇవాళ గ్రిల్ లిఫ్ట్‌లో వెళ్తుండగా ప్రమాదవశాత్తు లిఫ్ట్ గ్రిల్స్ మధ్య చిక్కుకుపోయింది. తీవ్రగాయాల కారణంగా చిన్నారి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. చిన్నారి మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
