Skip to content
Saturday, August 1, 2026
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu

  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu
  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్

12,728 villages | న‌గ‌ర‌మా…! నీకిది త‌గునా…?

Nagamani Malligari December 22, 2025 12,  728 village,  85 years,  90 percent,  assembly elections,  awareness,  Bank Account,  Democracy,  duplicate card,  fake holiday,  https://prabhanews.com/,  Polling,  postings,  social activists,  strict rules,  top position,  traffic,  vote

12,728 villages | న‌గ‌ర‌మా…! నీకిది త‌గునా…?

  • 12,728 villages | సామాజిక మాధ్యమాల్లో అలుపెరగని పోస్టింగుల(postings)తో సమాజంలో మార్పుకోసం పరితపిస్తున్నట్లు కనిపించే పట్టణ ఓటర్లు క్యూలో నిల్చోని ఓటు వేసేందుకు మాత్రం విముఖత వ్యక్తం చేస్తున్నారు….
  • భారత రాజ్యాంగం ప్రసాదించిన ఓటు అనే బాధ్యతను వారు విస్మరించడంతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి గండిపడుతోంది…
  • పోలీస్‌.. ట్రాఫిక్‌.. న్యాయవ్యవస్థ .. అధికార.. ప్రతిపక్ష పార్టీలపై సోషల్‌ మీడియాల్లో చెలరేగిపోయే నగర ఓటర్లు..
  • ఎన్నికల్లో ఓటు(vote) వేయాలంటే మాత్రం అసలు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది…
  • పట్టణ ఓటర్లకు కనువిప్పు కలిగేలా పల్లె ఓటర్లు పోలింగ్‌ రోజున పోటెత్తుతున్నారు…
  • దీంతో పల్లె ప్రజలంటే చులకనగా చూసే పట్టణ వాసులు అసలైన నాగరికత అంటే పబ్‌ల్లో తిరగడం మాత్రమే కాదని..
  • బాధ్యతలను కూడా గుర్తెరగడమని సామాజికవేత్తలు(social workers) పేర్కొంటున్నారు…
  • ఇటీవల జరిగిన పల్లెపోరులో రాష్ట్ర వ్యాప్తంగా 85శాతానికి పైగా ఓటింగ్‌ నమోదు కాగా..
  • అసెంబ్లీ ఎన్నికల్లో పట్టణాల్లో 50నుంచి 60శాతంలోపే ఓటింగ్‌ పోలవుతోంది…
  • రాష్ట్రంలో సరాసరి ఓటింగ్‌ 2014లో 69శాతం.. 2018లో 73.74శాతం.. 2023లో 71.34శాతం నమోదైంది.
  • ఇదే ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో వరుసగా 55.62శాతం.. 52.36శాతం.. 49.82శాతం పోలింగ్‌(polling) నమోదైంది…
  • గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజ్వరిల్లిన ప్రజాచైతన్యం.. పట్టణాల్లో అసలే కనిపించని తీరుపై ప్రతి ఒక్కరి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి…
  • ప్రజలను చైతన్యపరిచేలా ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టినా.. పట్టణవాసుల్లో మాత్రం చైతన్యం(awareness) రాకపోవడం పట్ల సామాజికవేత్తలు.. మేధావులు పెదవి విరుస్తున్నారు…
  • కఠిన నిబంధనలను అమలు చేయడం ద్వారానే ఓటింగ్‌ శాతం పెంచడం సాధ్యమవుతుందని వారు పేర్కొంటున్నారు…

12,728 villages | పొలిటికల్‌ బ్యూరో, ఆంధ్రప్రభ : గ్రామాల్లో పల్లెపోరు ముగిసింది. రాష్ట్రంలోని 12,728 గ్రామ(12,728 villages) పంచాయతీలకు గాను, 1204 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా, వివిధ కారణాలతో 53 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. వీటిలో హైకోర్టులో కేసులు పెండింగ్‌ ఉన్న కారణంగా 32 పంచాయతీలు ఎన్నికలకు దూరంగా ఉన్నాయి.

అయితే ఎన్నికలు జరిగిన గ్రామ పంచాయతీల్లో దాదాపు 85.30శాతం మంది ప్రజలు ఓటింగ్‌లో పాల్గొని, ప్రజాస్వామ్యం(democracy) కల్పించిన ఓటుహక్కును సద్వినియోగం చేసు కున్నారు. తమ అభిమాన నేతలను సర్పంచులు, వార్డు సభ్యు లుగా వారు ఎన్నుకున్నారు. ప్రతి ఎన్నికలోనూ ఇదే స్ఫూర్తి కనిపించాలని సామాజికవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.

పల్లె ప్రజల్లో ఉన్న చైతన్యం పట్టణాలకు వచ్చేసరికి ఆవిరై పోతుందన్న ఆవేదన వారి నుంచి వ్యక్తమవుతోంది. ఓటింగ్‌లో పాల్గొనకుండా, సామాజిక మాధ్యమాల్లో చైతన్యం రగిలించేలా పోస్టులు పెట్టే వారికి, బాధ్యత ఉన్నాట్లా లేనట్లా అన్న సందేహాలు సామాజికవేత్తల నుంచి వినిపిస్తున్నాయి.

ట్రాఫిక్‌(Traffic), వర్షం, అధికారుల నిర్లక్ష్యం అంటూ సామాజిక మాధ్యమాల్లో ఊదరగొట్టే సూడో మేధావులు, ఓటింగ్‌లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షించేందుకు ఓటింగ్‌లో ఎందుకు పాల్గొనడం లేదన్న ప్రశ్న వారి నుంచి వ్యక్తమవుతోంది.

12,728 villages | ఇదే చైతన్యం కొనసాగాలి..

తెలంగాణలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 85.30 శాతం పోలింగ్‌ నమోదైంది. మూడు దశల్లోనూ యాదాద్రి భువనగిరి జిల్లా మెరుగైన పోలింగ్‌ శాతంతో రాష్ట్రంలో అగ్రస్థానం(Top)లో నిలిచింది. కాగా అత్యల్ప ఓటింగ్‌ నమోదైన జిల్లాల్లో నిజామాబాద్‌ జిల్లా 76.45శాతం, రాజన్న సిరిసిల్ల 79.14శాతం నిలిచాయి.

తెలంగాణ అసెంబ్లిద్, పార్ల మెంట్‌ ఎన్నికలతో పోలిస్తే నమోదైన ఓటింగ్‌ శాతం పల్లె ప్రజల చైతన్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. డిసెంబర్‌ 11న జరిగిన తొలిదశ ఎన్నికల్లో 84.28శాతం, 14న జరిగిన రెండో దశ ఎన్నికల్లో 85.86శాతం, 17న జరిగిన మూడో దశ ఎన్నికల్లో 85.77శాతం ఓటింగ్‌ నమోదైంది.

ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం మూడు దశల పోలింగ్‌లో ఎక్కడ కూడా 80శాతా నికి తక్కువ నమోదు కాలేదు. కొన్ని ప్రత్యేక కారణాలతో కొన్ని జిల్లాల్లో అత్యల్ప ఓటింగ్‌ నమోదైనప్పటికీ, అది కూడా 75శాతానికి తక్కువ కాలేదు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 80నుంచి 90శాతం(90 percent) ఓటింగ్‌ నమోదు కావడంతో పట్టణాలకు పల్లెలకు మధ్య తేడా ఎందుకొస్తుందన్న చర్చ జరుగుతోంది. వ్యవసాయ పనులు, ఇతర అత్యవసర పరిస్థి తులున్నా, గ్రామా ల్లో ప్రజలు ఓటు వేసేందుకు మొగ్గు చూపుతారని ఈసీ గణాంకాలు స్ప‌ష్టం చేస్తున్నాయి.

12,728 villages | పట్టణాల్లో ఓటింగ్‌కు దూరం దూరం

హైదరాబాద్‌ మహానగరంతో పాటు, పలు మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనేందుకు అం తగా ఆసక్తి చూపడం లేదని ఎన్నికల సంఘం గణాంకాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. పల్లె ప్రాంతాలతో పోలిస్తే, ప ట్టణాల్లో దాదాపు 20 – 30శాతం తక్కువ పోలింగ్‌ నమోదు కావడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

కేవలం 50 నుంచి 60శాతం ఓటింగ్‌ జరుగుతున్న తీరుతో మిగతా ఓటర్లు ఎందుకు ఓటు వేయడం లేదన్న చర్చ జరుగుతోంది. 2014లో నిర్వహించిన అసెంబ్లి ఎన్నికల్లో(assembly elections) రాష్ట్రవ్యాప్తంగా 69శాతం ఓటింగ్‌ నమోదు కాగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో 55శాతానికి పరిమితమైంది.

2018 ఎన్నికల్లో 73.74శాతం నమోదు కాగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో 52శాతానికి దిగజారింది. 2023లోనూ 71.34 శాతం నమోదు కాగా, 49.82 నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఓటు వేసేందుకు ఎందుకని సుముఖత వ్యక్తం చేయడం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది. స్థానికులు కాకపోవడం, ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా తమకేం కాదులే అన్న ధీమాతో పాటు, మరో ప్రాంతంలో డూప్లి కేట్‌ ఓటు ఉండటం ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

12,728 villages | సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది…

అదేవిధంగా అద్దె ఇళ్లలో నివ సిస్తున్న కారణంగా పోలింగ్‌ కేం ద్రానికి దూరంగా ఉండాల్సి రావడం, మనకెందుకులే సెలవు రోజును ఫ్యామిలీ, ఫ్రెండ్సోతో జాలీగా గడిపేందుకు సిద్ధ పడ టం వంటి కారణాలు కనిపిస్తున్నాయి. ఫెయిడ్‌ హాలీడే(Fayed Holiday) ప్రకటిం చినా, ఓటు వేయని వారి విషయంలో ఎన్నికల సంఘం చర్యల కు సిద్ధం కావాలని పలువురు సూచించడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఐపీఎల్‌ మ్యాచ్‌, మాల్‌ ఓపెనింగ్‌, ఇతర సెల బ్రెటీ కార్యక్రమాలకు దండులా కదిలిపోయే పట్టణ ప్రజలు, ఓ టు కోసం గంట సమయం కూడా కేటాయించక పోవడం నైతిక త కాదన్న అభిప్రాయం సామాజికవేత్తల నుంచి వినిపిస్తోంది.

12,728 villages | ఆధార్‌తో లింక్‌ చేసుకోవాలని

భారతదేశంలో మితిమీరిన స్వేచ్ఛతో ఓటు వేసేందుకు కూడా ప్రజలు ముందుకు రాని పరిస్థితులు నెలకొన్నాయని సామాజిక వేత్తలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్‌ ఎకౌంట్‌(bank account), పాన్‌ కార్డు, మొబైల్‌ నెంబర్లను ఆధార్‌ కార్డు తో లింక్‌ చేసుకోవాలని కోరినప్పటికీ ప్రజల్లో అంతగా స్పం దన రాలేదని, ఖచ్చితమైన గడువు విధించి ఆలోపు చేసుకోక పోతే మొబైల్‌ నెంబర్‌ డీయాక్టివేట్‌ అవుతుంది, బ్యాంక్‌ ఖాతా మూసి వేయబడుతుంది. పాన్‌కార్డుతో అనుసంధానం కాకుంటే బ్యాంక్‌ ఎకౌంట్‌ నిర్వహణలో ఇబ్బందులు వస్తా యని హెచ్చరికలు చేయగానే దాదాపు 90శాతానికి పైగా ప్రజలు తమ ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారని వారు గుర్తు చేస్తున్నారు.

అదే విధానాన్ని ఓటర్‌ జాబితాకు అనుసం ధానం చేయమంటే మాత్రం ప్రైవసీకి భంగం వాటిల్లుతుందంటూ గగ్గోలు పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఓటరు జాబితాల తయారీ, డూప్లి కేట్‌(Duplicate ) ఓటర్‌ల తొలగింపునకు ఈ ప్రక్రియ దోహద పడుతుందని, స్వచ్ఛందంగా ఆధార్‌తో లింక్‌ చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కోరుతున్నా, ఆ దిశగా ప్రజల నుంచి అడుగులు పడటం లేదని వారు గుర్తు చేస్తున్నారు.

ఆధార్‌తో లింక్‌ చేయకుండా ప్రభుత్వ పథకాల లబ్ధి నిలిచి పోతుందని హెచ్చరిస్తే ఓటర్‌ జాబితాలోని పేరుకు ఆధార్‌ను అనుసంధానం చేసి తీరుతా రని, అంతేకాకుండా ఓటు తప్పనిసరిగా వేయకపోతే కఠిన నిబంధనల(strict rules)ను అమలు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘం రూల్‌ తీసుకురావాలని వారు కోరుతున్నారు.

12,728 villages | పోస్టల్‌ ఓటింగ్‌కు అవకాశం…

తద్వారా స్వచ్ఛందం గా తరలి వచ్చి ప్రజలు ఓటింగ్‌లో పాల్గొంటారని వారు స్ప‌ష్టం చేస్తున్నారు. ఇప్పటికే 2024 నుంచి హోమ్‌ ఓటింగ్‌ సౌక ర్యాన్ని కల్పించడంతో 85 ఏళ్లు(85 years) పైబడిన వారు, దివ్యాంగులు ఇంటి వద్దే ఓటు- వేసే అవకాశం లభించింది. ఇలాగే ఏదైనా అనారోగ్య కారణాలతో ఓటింగ్‌లో పాల్గొనేందుకు శరీరం సహకరించని వారి విషయంలోనూ పోస్టల్‌ ఓటింగ్‌కు అవ కాశం కల్పించడం ద్వారా ప్రతిఒక్కరూ ఓటు వేసేలా కేంద్ర ఎన్నికల(central elections) సంఘం సంస్కరణలు తీసుకు రావాలని సామా జికవేత్తలు కోరుతున్నారు.

CLICK HERE TO READ మహేష్‌, పవన్ గెలిచేది ఎవరు..?

CLICK HERE TO READ

  • World Cup T20 | భార‌త టీమ్ సూప‌ర్‌..
  • Collector | బాల్యవివాహాలను నిర్మూలిద్దాం..

You May Also Like

RR | తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య… అదనపు కలెక్టర్

April 3, 2025 Bala Raju

కుంచనపల్లిలో ఆల‌య పున‌ర్నిర్మాణం

October 31, 2025 Bala Raju

Anniversary | మాగుంట సుబ్బరామ రెడ్డి 78వ జయంతి

November 26, 2025 Babu Bahadur

TG | తెలంగాణ రైజింగ్ ను ఎవ‌రూ అడ్డుకోలేరు – రేవంత్ రెడ్డి

February 27, 2025 Gopi Krishna

Breaking | వైన్ షాపులో అగ్నిప్రమాదం..

June 17, 2026 Pavan Chandragiri

Fire Accident | విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం

May 23, 2025 Gopi Krishna

కార్టూన్ ‘ఔరా’:

1st August Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’

హైదరాబాద్ వార్తలు :

  • హైడ్రా కృషికి మళ్లీ జీవం
  • పోలీస్ కొలువులకు దరఖాస్తుల ప్రారంభం
  • విదేశీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
  • స్వర్ణం సాధించ‌డం దేశానికి గర్వకారణం : టీపీసీసీ అధ్యక్షుడు
  • కార్పొరేట్ పాలనకు కంపెనీ సెక్రటరీలే కీలకం: శ్రీధర్ బాబు
  • లష్కర్ బోనాలకు ట్రాఫిక్ ఆంక్షలు
  • టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత
  • శివ ప్రతాప్ శుక్లాను కలిసిన మంత్రి కొండా సురేఖ
  • ఫోటో ప్రదర్శనను వీక్షించిన సీఎం రేవంత్
  • సాగునీటిపై ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్

తాజా వార్తలు :

  • హైడ్రా కృషికి మళ్లీ జీవం
  • విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేత
  • ప్రతి ఇంటికీ ఆరు మొక్కల పంపిణీ
  • నూతన సాంకేతిక పరిజ్ఞానంతో భూముల రీ-సర్వే
  • Prime Minister Modi | స్వర్ణాంధ్రకు శ్రీకారం…
  • పోలీస్ కొలువులకు దరఖాస్తుల ప్రారంభం
  • ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి
  • టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ విజిట్‌కు దరఖాస్తుల ఆహ్వానం
  • ట్రాక్టర్ల వినియోగంపై నిషేధం..
  • జగిత్యాలలో వైద్య సదుపాయాల విస్తరణకు కృషి

అంతర్జాతీయం :

  • Gold-Price-Today -1-2026-Analysis | బంగారం ధ‌ర త‌గ్గింది… ఇప్పుడు కొనాలా? మరికొంత వేచి చూడాలా?
  • తల్లిపాలను ఎందుకు ‘అమృతం’ అంటారో తెలుసా?
  • gold-price-today-india-july-31-2026-24k-22k-digital-gold-analysis | అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గినా.. దేశీయంగా మళ్లీ పెరిగిన బంగారం ధరలు
  • Us-Sanctions : ఆ దేశాల‌పై ఫోక‌స్ Andhra Prabha Top Story
  • 14-Countries-Support : సౌదీ గెట్ రెడీ Andhra Prabha Top News

జాతీయం :

  • Gold-Price-Today -1-2026-Analysis | బంగారం ధ‌ర త‌గ్గింది… ఇప్పుడు కొనాలా? మరికొంత వేచి చూడాలా?
  • తల్లిపాలను ఎందుకు ‘అమృతం’ అంటారో తెలుసా?
  • రాజకీయ రణరంగం మారిందా?
  • ద్వేషం కాదు.. దారి చూపుదాం..
  • వరద నీటిలో చిక్కుకున్న 30 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లు

కెరీర్ :

  • నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
  • ఆగస్టు 14 వరకు దరఖాస్తుల స్వీకరణ
  • 3 Demands | 3 డిమాండ్లు పెట్టిన సీజేపీ
  • Narendra Modi | కీలక బిల్లుపై మోదీ సమీక్ష..
  • 75 percent | ఎస్పీ స్టూడెంట్స్ కు.. గుడ్ న్యూస్
  • OpenAI | ఓపెన్‌ఏఐలో కీలక పదోన్నతి
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • కృష్ణా
    • గుంటూరు
    • విశాఖపట్నం
    • కర్నూలు
    • నెల్లూరు
  • తెలంగాణ‌
    • హైదరాబాద్
    • వ‌రంగ‌ల్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
  • భక్తిప్రభ
  • ఆదివారం
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • About us
  • Privacy Policy
  • Contact Us
  • EDITORIAL POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS

Copyright © 2026 . All rights reserved. Andhra Prabha Publications Ltd. | www.prabhanews.com | Powered by Sri Deep Technologies