ఉత్పత్తి పెంపే లక్ష్యం.. భద్రతలో రాజీ లేదు
ఉత్పత్తి పెంపే లక్ష్యం.. భద్రతలో రాజీ లేదు
జూన్ లో 2.15 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి…
జులై లక్ష్యం 3.67 లక్షల టన్నులు..
ఎస్డిఎల్ యంత్రాల పనిగంటలు పెంచాలి..
గైర్హాజరు తగ్గిస్తేనే ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది..
వర్షా కాలానికి ముందు ఏర్పాట్లు పూర్తి చేయాలి
భూపాలపల్లి ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం..
భూపాలపల్లి రూరల్ , ఆంధ్రప్రభ : సింగరేణి భూపాలపల్లి ఏరియాలో సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనకు అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సమిష్టిగా కృషి చేయాలని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. జూన్ నెల ఉత్పత్తి, రవాణా పురోగతిపై విడుదల చేసిన ప్రకటనలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.
( బాక్స్ ఐటమ్ )
—- జూన్ నెల ఉత్పత్తి వివరాలు…
బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 2.35 లక్షల టన్నులు..
సాధించిన ఉత్పత్తి, రవాణా 2.15 లక్షల టన్నులు..
సాధించిన శాతం 92%
రోజువారి యావరేజ్ 7. 181 టన్నులు
(బాక్స్ ఐటమ్ )
— ఓబీ తొలగింపు వివరాలు (ఎల్బిసిఎం)
గని పేరు – టార్గెట్ – సాధించినది – శాతం
కేటీకే ఓసీ 2 – 10.03 – 8.83 – 88%
కేటీకే ఓసి 3 – 10.40 – 15.86 – 153%
మొత్తం – 20.43 – 24.69 – 121%
— జులై లక్ష్యం : 3.67 లక్షల టన్నులు…
జులై నెలకు 3.67 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాన్ని నిర్దేశించామని, ఓపెన్ కాస్ట్ గనులు కేటీకే ఓసి 2, కేటీకే ఓసి 3 లో 20.43 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబి తొలగింపు లక్ష్యంగా పెట్టుకున్నట్లు జీఎం తెలిపారు.
— ఉత్పత్తి పెంపునకు కీలక సూచనలు…
ఎస్‌డీఎల్ యంత్రాల పనిగంటలు పెంచడం, గైర్హాజరు శాతం తగ్గించడం, పనితీరును మెరుగుపరచడం ద్వారా ఉత్పత్తి పెంపు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
— భద్రత విషయంలో రాజీ లేదు…
భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేసిన జీఎం, వర్కింగ్ పర్మిషన్‌తో పాటు అన్ని భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. “రక్షణ విషయంలో రాజీ లేదు” అనే సూత్రంతోనే ఉత్పత్తి కొనసాగాలని తెలిపారు.
— వర్షాకాలానికి ముందస్తు చర్యలు…
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని బొగ్గు ఉత్పత్తి, రవాణాకు అంతరాయం కలగకుండా ఓపెన్‌కాస్ట్ గనులు, బొగ్గు నిల్వ కేంద్రాలు, రహదారులు, డ్రైనేజీ, పంపింగ్ వ్యవస్థలను ముందుగానే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల సమయంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే బృందాలను సిద్ధంగా ఉంచాలని, గనుల్లో కార్మికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
— సమిష్టి కృషితో లక్ష్యసాధన…
ఉత్పత్తి లక్ష్యాల సాధనతో పాటు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేస్తూ సమిష్టి కృషితో ముందుకు సాగితే సంస్థ లక్ష్యాలు సులభంగా సాధ్యమవుతాయని జీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. వర్షాకాలంలోనూ ఉత్పత్తి, రవాణా కార్యకలాపాలు సజావుగా కొనసాగేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు…
