Flavored Vapes Row : ఈ సిగరెట్ పొగ Andhra Prabha Latest News
Flavored Vapes Row : ఈ సిగరెట్ పొగ Andhra Prabha Latest News
- అమెరికా ఎఫ్‌డీఏ కమిషనర్ ఔట్
- ఫ్లేవర్డ్ వేప్స్ వివాదం
- ఎఫ్‌డీఏ కమిషనర్ రాజీనామా
- ట్రంప్ ప్రభుత్వ ఒత్తిడికి మకారీ వ్యతిరేకత
- యువతపై ఈ-సిగరెట్ల ప్రభావంపై ఆందోళన
- RFK జూనియర్‌తో విధానపర విభేదాలు
- వ్యాక్సిన్ విధానాలపై ఎఫ్‌డీఏలో గందరగోళం
- అబార్షన్ మాత్రల్లోనూ రాజకీయ ఒత్తిడి
- ఫార్మా కంపెనీల అసంతృప్తి
- తాత్కాలిక కమిషనర్‌గా కైల్ డయామంటాస్ బాధ్యతలు
( ఆంధ్రప్రభ, న్యూయార్క్ ప్రతినిధి)

Flavored Vapes Row : ఫ్లేవర్డ్ వేప్స్ వివాదంలో ఈ సిగరెట్స్ ను వ్యతిరేకించిన అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమిషనర్ డాక్టర్ మార్టీ మకారీ (Dr. Marty Makary) తన పదవికి రాజీనామా చేశారు. 13 నెలల పాటు ఈ పదవిలో కొనసాగిన ఆయన, మే 12, 2026న తన రాజీనామాను సమర్పించారు. పండ్ల రుచులతో ఈ-సిగరెట్లను (fruit-flavored vapes) అనుమతించాలని ట్రంప్ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. వీటి వల్ల యువత ,చిన్నారులు స్మోకింగ్ కు అలవాటు పడే ప్రమాదం ఉందని డాక్టర్ మకారీ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. చివరికి ప్రభుత్వం వీటిని అనుమతించడంతో, నైతిక కారణాల రీత్యా ఆయన తన పదవి నుంచి వైదొలిగారు. ఇక అనేక అంతర్గత విభేదాలనూ ఆయన తట్టుకోలేకపోయారు. హెల్త్ సెక్రటరీ రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్ (RFK Jr.) తో విధానపర విభేదాలు తలెత్తాయి. ముఖ్యంగా వ్యాక్సిన్ విధానాలు , ఇతర ఆరోగ్య నిర్ణయాల్లో కెన్నెడీ జోక్యం పెరగడంతో ఏజెన్సీలో గందరగోళం నెలకొంది.

వివిధ వర్గాల నుండి ఒత్తిడి కూడా మరో కారణంగా కనిపిస్తోంది. అబార్షన్ మాత్ర (Mifepristone) వినియోగాన్ని నియంత్రించాలని రిపబ్లికన్ల నుంచి తీవ్ర ఒత్తిడిని ఆయన తట్టుకోవాల్సి వచ్చింది. ఔషధాల ఆమోద ప్రక్రియలో అస్థిరత, అశాస్త్రీయ ధోరణుల వల్ల ఫార్మా కంపెనీల సీఈఓలు కూడా ఆయనపై అసహనం వ్యక్తం చేశారు. డాక్టర్ మకారీ రాజీనామాను ఆమోదించిన అనంతరం ట్రంప్ స్పందిస్తూ, “ఆయన మంచి వ్యక్తి, కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు” అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి ఎఫ్‌డిఏ (FDA) తాత్కాలిక కమిషనర్‌గా ఏజెన్సీకి చెందిన ఆహార నియంత్రణ విభాగం అధిపతి కైల్ డయామంటాస్ (Kyle Diamantas) బాధ్యతలు చేపట్టారు. డాక్టర్ మకారీ నిష్క్రమణతో అమెరికా ప్రజారోగ్య విభాగాల్లో కీలక ఎఫ్‌డిఏ, సిడిసి (CDC) సర్జన్ జనరల్ పదవుల్లో ప్రస్తుతం పూర్తిస్థాయి అధికారులు లేరు.
ALSOREAD Sparta 3 Mystery : అతి రహస్యం Andhra Prabha Top Story
