ప్రభుత్వ పాఠశాలలో కుమారుడిని చేర్పించిన సర్పంచ్
తొర్రూరు టౌన్,ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య సాధ్యమని మాటేడు సర్పంచ్ నాగరబోయిన సునీల్ యాదవ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామానికి చెందిన సర్పంచ్ సునీల్ యాదవ్ తన కుమారుడు మాస్టర్ హర్షవర్ధన్ యాదవ్‌ను బుధవారం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆయన పిలుపునిచ్చారు.
