‎Lenin Song | లెనిన్ నుంచి కొత్త సాంగ్..!

‎Lenin Song | లెనిన్ నుంచి కొత్త సాంగ్..!

‎Lenin Song | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: అక్కినేని అఖిల్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘లెనిన్‌’ నుంచి వచ్చిన ‘Soul of Lenin’ సాంగ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇది రొటీన్‌ లవ్‌ సాంగ్‌లా కాకుండా.. ప్రేమలోని సంఘర్షణలు, బాధ, త్యాగం, నిలబడే ధైర్యాన్ని ఎమోషనల్‌గా చూపించేలా ఉంది.
‎ఈ పాట విజువల్స్‌ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి.

అఖిల్‌ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జోడీ తెరపై ఫ్రెష్‌గా కనిపిస్తుండగా.. ఇద్దరి లుక్స్‌, ఎమోషనల్‌ ప్రెజెన్స్‌ సాంగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రేమను కేవలం సెలబ్రేట్‌ చేయడం కాకుండా.. ప్రేమలోని కష్టాలు, త్యాగాలు, ఆత్మను చూపించేలా పాటను తీర్చిదిద్దారు.

‎మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ మెలోడీకి డ్రామా టచ్‌ జోడించి పాటను మరింత ఎలివేట్‌ చేశాడు. కల్యాణ్‌ చక్రవర్తి రాసిన హృదయాన్ని తాకే లిరిక్స్‌కు వాగ్దేవి గాత్రం బలాన్ని ఇచ్చింది. ఆమె వాయిస్‌ పాటలోని బాధను, ప్రేమలోని తీవ్రతను మరింత గాఢంగా వినిపించింది.

‎మురళీ కిషోర్‌ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అఖిల్‌ సరికొత్త ఇంటెన్స్‌ అవతార్‌లో కనిపించనున్నట్లు ఇప్పటికే టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమా జూన్ 26 థియేటర్ లో రిలీజ్ కానుంది.