AIADMK47 seats | తమిళ రాజకీయాల్లో కలకలం

AIADMK47 seats | తమిళ రాజకీయాల్లో కలకలం
AIADMK47 seats | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. AIADMK పార్టీలో విభేదాలు బహిర్గతమవుతూ చీలికకు దారితీశాయి. వేలుమణి, సీవీ.షణ్ముగం వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అధికార TVK ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
మీడియాతో మాట్లాడిన సీవీ షణ్ముగం.. తమ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు త్వరలో ముఖ్యమంత్రి విజయ్ ను కలిసి మద్దతు తెలియజేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీ చీఫ్ ఎడప్పాడి కె.పళనిస్వామి డీఎంకేతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నించారని షణ్ముగం ఆరోపించారు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే 47 స్థానాలు గెలుచుకున్నప్పటికీ పార్టీ అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిర్గతమవుతున్నాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
