నరహరిశెట్టి కుటుంబాన్ని పరామర్శించిన లగడపాటి

నరహరిశెట్టి కుటుంబాన్ని పరామర్శించిన లగడపాటి

భవానిపురం, ఆంధ్రప్రభ : సమైక్యాంధ్ర ఉద్యమ నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి,సీనియర్‌ హైకోర్టు న్యాయవాది, స్వర్గీయ నరహరిశెట్టి శ్రీహరి కుటుంబ సభ్యులను మాజీ పార్లమెంట్‌ సభ్యులు లగడపాటి రాజగోపాల్‌ బుధవారం పరామర్శించారు. నరహరిశెట్టి శ్రీహరి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. నగరానికి వచ్చిన లగడపాటి రాజగోపాల్‌ నరహరిశెట్టి శ్రీహరి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

శ్రీహరితో తనకు ఉన్న సానిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షులు, శ్రీహరి సోదరుడు నరహరిశెట్టి నరసింహారావను పలకరించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో నరహరిశెట్టి శ్రీహరి చేసిన కార్యక్రమాలను, ఆయన పాత్రను నాయకులతో పంచుకున్నారు. కార్యక్రమంలో నాయకులు మాజీ కార్పొరేటర్‌ నరసింహచౌదరి, కొనిజేటి రమేష్, శ్రీహరి కుటుంబ సభ్యులు రామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.