మండలంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

మండలంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : ఎ.కొండూరు మండలం లోని మారేపల్లి,కోడూరు కంభంపాడు, ఎ.కొండూరు, అడ్డరోడ్డు తండా తదితర గ్రామాల్లో ఆదివారం కూటమి నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహా నిధి చెక్కులను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల టిడిపి సీనియర్ నాయకులు, టిడిపి మండల మాజీ అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య ఖర్చులు భారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అండగా నిలుస్తుందని తెలిపారు.

అత్యవసర వైద్య చికిత్సల కోసం ఈ నిధి ఎంతో ఉపయోగపడుతుందని అర్హులైన ప్రతి ఒక్కరు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడం వారికి తక్షణ సహాయం అందించడం తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రధమ కర్తవమని, ప్రతి గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు.

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తాళ్లురు నాగేశ్వరావు, సీనియర్ నాయకులు వనపర్ల డేవిడ్ రాజు, మండల తెలుగు యువత అధ్యక్షులు సాదం నరసింహారావు యాదవ్, మండల ఎస్ సి సెల్ అధ్యక్షుడు మేకల జాన్, (రామారావు) రాంబాబు, కొంగల కృష్ణ, మట్టగుంజి గిరిబాబు, భీమాల నాగేశ్వరరావు, మండల ఎస్టీ సెల్ నాయకులు పండు నాయక్, కృపానందం, నరేష్, గణేష్, సత్యానందం స్థానిక ప్రజాప్రతినిధులు, పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు.

Leave a Reply