KTR | హామీలు అమలు చేస్తే రాజీనామా చేస్తా

KTR | హామీలు అమలు చేస్తే రాజీనామా చేస్తా

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

KTR | హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఖైరతాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మాట్లాడిన కేటీఆర్.. ఎన్నికల సమయంలో మహిళలు, నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మహిళలకు హామీ ఇచ్చిన ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి పూర్తిగా అమలు చేస్తే తాను రాజకీయాలకు రాజీనామా చేస్తానని వ్యాఖ్యానించారు. ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్‌కు ప్రజల మద్దతు కొనసాగుతోందని పేర్కొన్న కేటీఆర్.. 2028 ఎన్నికల్లోనూ గులాబీ జెండా ఎగరేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Leave a Reply