Singgeetham | టాలీవుడ్‌ లెజెండ్ డైరెక్టర్‌ సృష్టించిన అద్భుతం

Singgeetham | టాలీవుడ్‌ లెజెండ్ డైరెక్టర్‌ సృష్టించిన అద్భుతం

Singgeetham | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: పాతికేళ్లకే లైఫ్ బోర్ అంటుంటాం.. ముప్పై ఏళ్లు రాకముందే ఏజ్‌ వచ్చేసిందిరా.. అని ఫీలైపోతుంటాం. కానీ ఆయన ఆ పాతికను ఇప్పటికే నాలుగు సార్లు దాటేశారు 94 ఏళ్ల వయసులో చేతిలో ఫోన్ పట్టుకోవడమే కష్టం అలాంటింది.. ఆయన ఈ వయసులో చేతిలోకి ‘మెగాఫోన్’ పట్టారు!

ఆయనే.. మన టాలీవుడ్ గర్వించదగ్గ అద్భుత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఆయన చేసేవన్నీ అద్భుతాలే..
తెలుగు సినిమా చరిత్రను తిరగేస్తే సింగీతం శ్రీనివాసరావు సృష్టించినవన్నీ అపురూప కళాఖండాలే. ఇప్పటకీ టాలీవుడ్ లో ఎవరు టచ్ చేయలేకపోతున్న టైమ్ మిషన్ కథను ‘ఆదిత్య 369’తో అప్పట్లోనే చూపించారు. ‘విచిత్ర సోదరులు’లో పొట్టి కమల్ హాసన్‌ను ఎలా తెరపై చూపించారనేది ఇప్పటికీ ఒక చిక్కు ప్రశ్నే! ‘భైరవద్వీపం’ లాంటి జానపదం, ‘పుష్పక విమానం’ లాంటి మాటల్లేని మూకీ సినిమా.. ఇలా ఆయన చేసినవన్నీ తెలుగు సినీ అద్భుతాలు.

కానీ అప్పట్లోనే అన్నీ చేసేశాం కదా.. అని ఆయన ఖాళీగా కూర్చోలేదు. “చేయాల్సినవి ఇంకా చాలా మిగిలిపోయాయి కదా” అంటూ మళ్లీ కొత్త ఉత్సాహంతో రంగంలోకి దిగారు. కుర్రాళ్లలో కుర్రాడిలా కలిసిపోయి, కొత్తవాళ్లతో పోటీపడి, ఈ వయసులో ఇంకో సినిమా పూర్తి చేసేశారు.

ఆ సినిమానే.. ‘సింగ్ గీతం’…

అప్పట్లో ‘పుష్పక విమానం’తో ఒక్క మాట కూడా లేకుండా సినిమా తీసి దేశాన్ని ఆశ్చర్యపరిచారు సింగీతం. అలాంటి దర్శకుడికి ఇప్పుడు కేవలం పాటలతో సినిమా తీయడం పెద్ద వింతేమీ కాదు. కానీ, చూసే మనకు మాత్రం అదొక వింత.. సరికొత్త అనుభూతి. పాటలే ప్రేరణగా సాగే ‘సింగ్ గీతం’ సినిమా తెలుగు చలనచిత్ర జగత్తులో ఇంకో కొత్త అధ్యాయం కాబోతోంది.

రికార్డుల కోసం కాదు.. ఆ లెజెండ్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి!
ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డుల కోసమో, అవార్డుల కోసమో తీసింది కాదు. 94 ఏళ్ల వయసులోనూ సినిమాపై పడి చస్తున్న ఒక లెజెండరీ దర్శకుడి ప్యాషన్‌ను థియేటర్లలో సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ సినిమా చూడాలి.
ఈ వారమే ‘సింగ్ గీతం’ థియేటర్లలోకి రాబోతోంది. మరి ఆ లెజెండ్ సృష్టించిన సరికొత్త మ్యాజిక్‌ను చూడటానికి, అందరూ పాడుకోవడానికి సిద్ధమైపోండి.

CLICK HERE TO READ Anumana Pakshi | ఆసక్తి రేకెత్తిస్తున్న ‘అనుమాన పక్షి’ టీజర్‌

CLICK HERE TO READ MORE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *