చిన్నగుల్లలో 17న పురుషోత్తం మహారాజ్ కీర్తన కార్యక్రమం

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : సుప్ర సిద్ధ కీర్తనకారులు మహారాష్ట్రలోని బుల్డాన జిల్లాకు చెందిన శ్రీహ,బ,ప పురుషోత్తం మహారాజ్ ఈనెల17న జుక్కల్ మండలంలోని చిన్నగుల్లకు రారున్నారు. చిన్నగుల్ల గ్రామవాసులు స్వాతి-జ్ఞానేశ్వర్ లాదే గారి కుమారుని నామకరణం కార్యక్రమంలో ఆయన పాల్గొని కుమారున్ని ఆశీర్వదించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని రాత్రి 9 నుండి11 గంటల వరకు భవ్యమైన కీర్తనకార్యక్రమం నిర్వహించనున్నారు. నిర్వాహకులు ఇప్పటినుండే ఈకార్యక్రమం కోసం సకలసౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.తెలంగాణనే కాకుండా కర్ణాటక,మహారాష్ట్ర నుండి సైతం వేలాదిగా భక్తులు,ప్రజలు ఈకీర్తన కార్యక్రమంలో పాల్గొననున్నారు.