Kaleshwaram zone | ఎస్సైల బదిలీలు.. ఉత్తర్వులు జారీ

Kaleshwaram zone | ఎస్సైల బదిలీలు.. ఉత్తర్వులు జారీ

పెద్దపల్లి, ఆంధ్రప్రభ: కాలేశ్వరం జోన్ పరిధిలో పనిచేస్తున్న నలుగురు సబ్‌ ఇన్‌స్పెక్టర్లను (ఎస్‌ఐలు) బదిలీ చేస్తూ జోన్ డీఐజీ, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

ఉత్తర్వుల ప్రకారం, మంచిర్యాల సీసీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న కే. నరేష్ను పెద్దపల్లి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేరమెరి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మధుకర్ను రామగుండం వీఆర్‌కు మార్చారు. అలాగే ములుగు డీఎస్‌బీలో విధులు నిర్వహిస్తున్న ఉపేందర్‌రావును రామగుండం సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఇటీవల పెద్దపల్లికి బదిలీ అయిన జీవన్కు సంబంధించిన గత ఉత్తర్వులను రద్దు చేసి, ఆయనను సీసీఎస్ పెద్దపల్లికి బదిలీ చేస్తూ తాజా ఆదేశాలు జారీ చేశారు.