Jubilee Hills | యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం
Jubilee Hills | యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం
Jubilee Hills | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో పరామర్శించారు. జూబ్లీహిల్స్‌లోని పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
గత కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్ అనారోగ్యంతో బాధపడుతూ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఆయన ఇంటికి వెళ్లి యోగక్షేమాలు విచారించారు.
ఇద్దరి మధ్య కొద్దిసేపు రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి పరామర్శించడంతో జనసేన, టీడీపీ శ్రేణుల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతోంది.
